Uppal Shilparamam: ఉప్పల్ శిల్పారామంలో ‘నాట్య సూత్రం’ భరతనాట్య మహోత్సవం: అట్టహాసంగా ప్రారంభమైన నృత్య వేడుక!

Uppal Shilparamam: హైదరాబాద్‌ ఉప్పల్‌ శిల్పారామం వేదికగా శ్రీ లాస్య నృత్యాలయ ఆధ్వర్యంలో ‘నాట్య సూత్రం’ భరతనాట్య మహోత్సవం ఘనంగా జరిగింది.

KARUNAKAR, UPPAL
Published on: 9 May 2026 7:38 PM IST
Uppal Shilparamam
X

Uppal Shilparamam: ఉప్పల్ శిల్పారామంలో ‘నాట్య సూత్రం’ భరతనాట్య మహోత్సవం: అట్టహాసంగా ప్రారంభమైన నృత్య వేడుక!

ఉప్పల్: హైదరాబాద్‌ ఉప్పల్ లోని శిల్పారామం వేదికగా శ్రీ లాస్య నృత్యాలయ ఆధ్వర్యంలో, అంతర్జాతీయ ప్రైడ్ ప్రపంచ రికార్డ్స్ సహకారంతో నిర్వహిస్తున్న “నాట్య సూత్రం” భరతనాట్య మహోత్సవం శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం భరతనాట్య కళా వైభవాన్ని, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో, ప్రముఖ నాట్యాచార్యురాలు డా. విశాఖ ప్రకాష్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ మహోత్సవం కళా, భక్తి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచింది.

ఈ సందర్భంగా కళాకారులు శ్లోకం, పుష్పాంజలి, అలరిప్పు, జతిస్వరము, వర్ణం, కీర్తనం, తిల్లానా వంటి భరతనాట్య ప్రదర్శనలను అద్భుతంగా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా నాట్య సూత్రం ద్వారా శ్లోకాలు, హస్తాలు, భేదాలు, వినియోగాలు వంటి నాట్యశాస్త్ర విశేషాలను ప్రదర్శిస్తూ భారతీయ నృత్య సంప్రదాయంలోని వైశిష్ట్యాన్ని చాటిచెప్పారు. అంతర్జాతీయ ప్రైడ్ ప్రపంచ రికార్డ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు ప్రయత్నంగా నిర్వహించిన ఈ మహత్తర కార్యక్రమం కళాప్రియులకు చిరస్మరణీయ అనుభూతిని అందించింది. భరతనాట్యం ద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, భక్తి భావాలను యువతరానికి చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ మహోత్సవం విశేష ఆదరణ పొందింది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story