Pocharam: సంస్కృతి టౌన్‌షిప్‌లో పేకాట స్థావరంపై ఎస్‌వోటీ దాడి!

Pocharam: పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో పేకాట స్థావరంపై ఉప్పల్ ఎస్‌వోటీ దాడి ఆరుగురు అరెస్ట్.. రూ.89,980 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం కేసు నమోదు చేసిన పోలీసులు.

KARUNAKAR, UPPAL
Published on: 1 Oct 2026 11:14 PM IST
Pocharam
X

Pocharam: సంస్కృతి టౌన్‌షిప్‌లో పేకాట స్థావరంపై ఎస్‌వోటీ దాడి!

పోచారం: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అన్నోజిగూడ సంస్కృతి టౌన్‌షిప్‌లో పేకాట స్థావరంపై ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ బృందం సంస్కృతి టౌన్‌షిప్‌లోని పేకాట స్థావరంపై దాడి చేసింది.

ఈ సందర్భంగా కొమురయ్య, గుండు వెంకటేశ్వర్లు, అముద శ్రీనివాస్‌, జోలుకుంట్ల సుకృత్‌రెడ్డి, కుక్కునూరు రామచంద్రరెడ్డి, గుడిపాటి కరుణాకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెట్ల పేకముక్కలు, ఆరు స్మార్ట్‌ఫోన్లు, రూ.89,980 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిని పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోచారం ఇన్‌స్పెక్టర్‌ జగన్నాథ్‌ హెచ్చరించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL