Uppal: ఉప్పల్‌లో సమ్మర్ కోచింగ్ క్యాంప్.. 12 క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ!

Uppal: ఉప్పల్ జోన్ పరిధిలో సమ్మర్ కోచింగ్ క్యాంప్–2026 ప్రారంభం! 12 క్రీడా విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ.

KARUNAKAR, UPPAL
Published on: 26 April 2026 8:32 AM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో సమ్మర్ కోచింగ్ క్యాంప్.. 12 క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ!

ఉప్పల్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలోని ఉప్పల్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్–2026ను శనివారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయం సమీపంలోని స్టేడియంలో ఎంఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, జోనల్ కమిషనర్ రాధిక గుప్తాతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో శిక్షణ పొందేందుకు వారు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ జోన్‌కు చెందిన 5 సర్కిళ్లలో మొత్తం 78 కేంద్రాల్లో 12 క్రీడా విభాగాల్లో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. వాలీబాల్, యోగా, కరాటే, క్రికెట్, క్యారెమ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, రోలర్ స్కేటింగ్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, టెన్నీ కోయిట్ వంటి క్రీడలను ఈ క్యాంప్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story