Uppal: ఉప్పల్‌లో వైభవంగా రావణ దహనం హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

Uppal: ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో వైభవంగా రావణ దహనం. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు.

KARUNAKAR, UPPAL
Published on: 20 Oct 2026 10:25 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో వైభవంగా రావణ దహనం హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

ఉప్పల్‌: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మేడ్చల్bమల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపతి రెడ్డి కూడా వేడుకల్లో పాల్గొన్నారు. విజయదశమి పండుగ సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథుల రాకతో కార్యక్రమ ప్రాంగణంలో సందడి నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న నాయకులు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. విజయదశమి చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. రావణ దహనం ద్వారా ధర్మం, సత్యం, న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే సందేశం ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు.

ప్రజలందరూ ఐకమత్యంతో ఉంటూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.nటీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్న ఈ వేడుకలు ఉప్పల్‌లో పండుగ వాతావరణాన్ని నింపాయి. మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL