uppal: సినిమాలకు రమ్మని వేధింపులు.. బోడుప్పల్ కాలేజీలో ఏం జరుగుతోంది?

uppal: ఉప్పల్ విషన్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో ప్రిన్సిపాల్ అజయ్ బాబు మరియు ఫ్యాకల్టీ సభ్యులపై విద్యార్థినులు అసభ్య ప్రవర్తన ఆరోపణలు చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 4 May 2026 5:10 PM IST
uppal
X

uppal: సినిమాలకు రమ్మని వేధింపులు.. బోడుప్పల్ కాలేజీలో ఏం జరుగుతోంది?

ఉప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌ లో ఉన్న విషన్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ప్రిన్సిపాల్ అజయ్ బాబు సహా పలువురు ఫ్యాకల్టీ సభ్యులపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థినుల వివరాల ప్రకారం, కొందరు ఫ్యాకల్టీ సభ్యులు వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం, కాలేజీ ప్రాంగణంలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం బదులుగా, ఆయన కూడా అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపించారు.

చూపుల్లో అసభ్యత, అనవసరంగా ముట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక ఫ్యాకల్టీ సభ్యుడు సోమశేఖర్ విద్యార్థినులను సినిమాలకు రావాలని ఒత్తిడి చేయడం, గౌతమ్ అనే ఫ్యాకల్టీ అసభ్య చాటింగ్ చేయడం, శ్రీకాంత్ మద్యం సేవించి కాలేజీకి రావడం, రాత్రివేళ ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు.

ఈ ఘటనపై ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్‌ తో పాటు సంబంధిత ఫ్యాకల్టీ సభ్యులను వెంటనే తొలగించాలని కాలేజీ చైర్మన్ నరసింహరెడ్డిని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చైర్మన్ నరసింహరెడ్డి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ ను, ఫ్యాకల్టీని తొలగియ్యాలని పట్టుబట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు సమస్యపై ఆరాతీస్తున్నారు. విద్యార్ధినులు, విద్యార్ధి సంఘాల ఒత్తిడితో ప్రిన్సిపాల్, ఫ్యాక్టల్టీని తొలగిస్తున్నట్లు చైర్మన్ నరసింహ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story