Madugula: కలకొండలో మృతురాలి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం!

Madugula: మాడుగుల మండలం కలకొండలో మృతురాలి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం అందించిన ఉప్పల వెంకటేష్. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Sept 2026 4:59 PM IST
Madugula
X

Madugula: కలకొండలో మృతురాలి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం!

Madugula: కలకొండ గ్రామానికి చెందిన రెడ్డమోని లక్ష్మమ్మ ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిషన్‌ భగీరథ మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పల వెంకటేష్‌ స్పందించి మృతురాలి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.

కలకొండ గ్రామ మాజీ సర్పంచ్‌ గొర్రె పవన్‌కుమార్‌ రెడ్డి ద్వారా లక్ష్మమ్మ మృతి విషయం తెలుసుకున్న ఉప్పల వెంకటేష్‌ వెంటనే రూ.3 వేల ఆర్థిక సహాయాన్ని ఆమె కుమారులు రెడ్డమోని తానయ్య, రెడ్డమోని మల్లేష్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యుడు పల్లె నరేష్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గుండాల చంద్రయ్య, గుండాల రాజు, గోరంట్ల మహేష్‌, గోరంట్ల జంగయ్య, అంబోజు సతీష్‌, ఎండీ జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY