Medchal: నారాయణ స్కూల్ అడ్మిషన్లపై రగడ.. రంగంలోకి దిగిన USFI

Medchal: మేడ్చల్ జిల్లా అత్వెల్లిలోని నూతన నారాయణ స్కూల్ వద్ద USFI విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 12 May 2026 12:53 PM IST
Medchal
X

Medchal: నారాయణ స్కూల్ అడ్మిషన్లపై రగడ.. రంగంలోకి దిగిన USFI

మేడ్చల్: అత్వెల్లి లోని నూతన నారాయణ స్కూల్ ముందు USFI ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థుల అడ్మిషన్లు చేపడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. ఈ విషయంపై ఇప్పటికే MEO, DEO అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని USFI జిల్లా కార్యదర్శి వెంకట్ ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి స్కూల్ అనుమతులపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story