Hyderabad: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి రోగులకు అలర్ట్.. వారం రోజుల్లో కీలక సేవలు షురూ!
Hyderabad: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్ పరికరాన్ని తక్షణమే అందుబాటులోకి తెవాలని బీఆర్‌ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ చింతల రవికుమార్ వినతిపత్రం ఇచ్చారు.
Hyderabad: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి రోగులకు అలర్ట్.. వారం రోజుల్లో కీలక సేవలు షురూ!
Vanasthalipuram: వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్ గారిని కలిసి సిటీ స్కాన్ పరికరాన్ని తక్షణమే రోగులకు తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని వనస్థలిపురం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చింతల రవికుమార్ మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం గౌరవ ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి సహకారం మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారి సహకారంతో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌కు సిటీ స్కాన్ పరికరం కేటాయించబడిందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఆ పరికరం ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం తో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు మరియు అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు సిటీ స్కాన్ సేవలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, కాలనీవాసులు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించినట్లు తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి దృష్టికి మరోసారి తీసుకెళ్లి, అతి త్వరలోనే సిటీ స్కాన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరుగుతుంది అని చింతల రవికుమార్ గారు కోరారు. ఇట్టి విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్ గారు సానుకూలంగా స్పందించి, వారంరోజుల్లోపు సిటీ స్కాన్ పరికరాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొలిశెట్టి సంజయ్ కుమార్ గారు, ఫేస్-4 కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రావు గారు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు లగ్గొని శ్రీధర్ గౌడ్ గారు, ఉపాధ్యక్షులు ఆనంద్ రాజు గారు, పార్ధివాడ బస్తీ అధ్యక్షులు శక్తి కిషోర్ గారు, పరమేశ్వర్ గౌడ్ గారు, విజయ్ గారు, కిషోర్ గారు, వంశీధర్ గారు తదితర నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు




