Vanasthalipuram: వనస్థలిపురంలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
Vanasthalipuram: వనస్థలిపురంలో వృద్ధ దంపతులను మాటల్లో పెట్టి 30 గ్రాముల బంగారం చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Vanasthalipuram: వనస్థలిపురంలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఎల్బీనగర్: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును ఛేదించారనీ తెలిపిన వనస్థలిపురం ఇంచార్జ్ ఏసిపి కర్ణాకర్ రావు.
కేసు వివరాలు
* ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున సుమారు 6:04 గంటలకు వనస్థలిపురం పరిధిలోని రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో ఈ చోరీ ఘటన జరిగినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
* ఇంట్లో నిద్రిస్తున్న 66 ఏళ్ల వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని నిందితులు చోరీకి పాల్పడ్డారు.
* బాధితుల నుంచి సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు.
* కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలు
* A1: అనసుపు రెడ్డి — వయస్సు 23 సంవత్సరాలు.
* A2: తెన్కె వరలక్ష్మి — వయస్సు 24 సంవత్సరాలు.
చోరీ చేసిన విధానం
నిందితులు ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితులను మాటల్లో పెట్టి, వారి దృష్టిని మళ్లించి బంగారు ఆభరణాలను అపహరించినట్లు ప్రెస్‌నోట్‌లో వివరించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
* సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు.
* ఒక రియల్‌మీ మొబైల్ ఫోన్.
* ఒక వివో Y-31 మొబైల్ ఫోన్.




