Vanasthalipuram: రవీంద్ర భారతి తరహా ఆడిటోరియం మధుయాష్కి గౌడ్!
Vanasthalipuram: వనస్థలిపురంలో రూ. 25 కోట్లతో రవీంద్ర భారతి తరహా ఆడిటోరియం నిర్మిస్తామని తెలిపిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్.
Vanasthalipuram: రవీంద్ర భారతి తరహా ఆడిటోరియం మధుయాష్కి గౌడ్!
Vanasthalipuram: సంస్కార భారతి నిర్వహణలో ఎస్.కె.ఎన్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ వద్ద పార్కులో నిర్వహించిన 150 మంది విద్యార్థులతో సంగీత నృత్యరూపకం కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. తమ సంగీతం, నృత్యంతో ప్రేక్షకులను ఆలరించిన చిన్నారులను మధుయాష్కి గారు అభినందించారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. రవీంద్ర భారతి తరహాలో వనస్థలిపురంలో రూ. 25 కోట్లతో ఆడిటోరియాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలత తెలిపారని, త్వరలో నిధులు మంజూరు చేసేరా కృషి చేస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు, నేలపాటి రామారావు గారు, డివిజన్ల అధ్యక్షులు కొల్లూరు శ్రీనాథ్ గారు, గోపి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, రమాకాంత్ గుప్తా గారు, డివిజన్ మాజీ అధ్యక్షులు కుట్ల నరసింహ యాదవ్ గారు, మకుటం సదాశివుడు గారు, డీసీసీ ఉపాధ్యక్షులు కొండోజు శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శిలు స్వర్ణ మాధవి గారు, డేరంగుల కృష్ణ గారు, జిల్లా స్పోక్స్ పర్సన్ దాము మహేందర్ యాదవ్ గారు, కార్యదర్శులు రిజ్వాన్ గారు,నరేష్ గుప్తా గారు, నాయకులు శశికాంత్ గారు, ఇర్ఫాన్ గారు, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ సూలాపాణి గారు, వెంకటాచార్య గారు పాల్గొన్నారు.




