Vanasthalipuram: వనస్థలిపురంలో 'హెల్మెట్ బ్యాంక్' ప్రారంభం
Vanasthalipuram: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా 'హెల్మెట్ బ్యాంక్'ను ప్రారంభించారు.
Vanasthalipuram: వనస్థలిపురంలో 'హెల్మెట్ బ్యాంక్' ప్రారంభం
Vanasthalipuram: ప్రజల్లో రోడ్డు భద్రతా అవగాహన పెంచేందుకు వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో "హెల్మెట్ బ్యాంకు" కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు.
వనస్థలిపురం 11.07.2026 సాయంత్రం 6 గంటలకు పనామా, వనస్థలిపురం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ DCP ట్రాఫిక్ వి. శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో అడిషనల్ DCP ఎల్బీనగర్ ట్రాఫిక్ శ్రీనివాస్ కుమార్, ACP ఎల్బీనగర్ ట్రాఫిక్ నవీన్ రెడ్డి, ట్రాఫిక్ CI శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం, SI లు శ్రీను, యాదయ్య, ASI రమణారెడ్డి తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎలా పనిచేస్తుంది?
హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారిని గుర్తించి, వారికి ట్రాఫిక్ పోలీసులు ఉచితంగా హెల్మెట్ అందజేస్తారు. వారి వద్ద ID Proof తీసుకున్న తర్వాత, 24 గంటలలోపు వారు సొంత హెల్మెట్ తీసుకువచ్చి, పోలీసులు ఇచ్చిన హెల్మెట్ ను తిరిగి "హెల్మెట్ బ్యాంకు" లో డిపాజిట్ చేయాలి.
బ్యానర్ లలో "RIDE SAFE, RIDE SMART! HELMETS SAVE LIVES" అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.




