Gandipet: చిలుకూరు బాలాజీ దేవాలయంలోవరుణ జపం

Gandipet: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ జూలై 21, 2026న చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో గండిపేట జలాశయంలో అర్చకులు వరుణ జపం నిర్వహించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 July 2026 10:35 AM IST
Gandipet
X

Gandipet: చిలుకూరు బాలాజీ దేవాలయంలోవరుణ జపం

Gandipet: తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ జూలై 21, 2026 (మంగళవారం) ఉదయం 8.30 గంటల నుండి 11.00 గంటల వరకు చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయంలో వరుణ జపం నిర్వహించబడుతుంది.

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ సి.ఎస్. లక్ష్మీనరసింహన్ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేదపండితులు నడుములోతు నీటిలో నిలబడి ఈ వైదిక అనుష్ఠానాన్ని నిర్వహిస్తారు.

వేదభవనంకు చెందిన డా. వి. శ్రీరామ ఘనపాటి నాయకత్వంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలోని వరుణ జప మంత్రాలను సంప్రదాయబద్ధంగా 108 సార్లు పారాయణం చేస్తారు. శ్రీ చిలుకూరు బాలాజీ అనుగ్రహంతో వరుణదేవుడు, ఇంద్రదేవుడు ప్రసన్నులై సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ఈ మహా ప్రార్థన నిర్వహించబడుతోంది.

ఈ వరుణ జపం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, నదులు, జలాశయాలు నిండిపోవాలని, ఎండిపోతున్న పంటలు పునరుజ్జీవం పొందాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు చేకూరాలని ఆలయ అర్చకులు ప్రార్థించనున్నారు.

భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని లోకక్షేమం కోసం జరిగే ఈ వైదిక ప్రార్థనలో భాగస్వాములు కావాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆహ్వానిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story