Tandur: ఘనంగా వరుణ యాగం సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు!
Tandur: ది గ్రీన్ అండ్ షేడ్స్ ఆధ్వర్యంలో తాండూరులో వరుణ యాగం నిర్వహణ. పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, మున్సిపల్ నేతలు.
Tandur: ఘనంగా వరుణ యాగం సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు!
Tandur: తాండూరు పట్టణంలో ది గ్రీన్ అండ్ షేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగము , పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు రైతులు వ్యాపారులు సుభిక్షంగా ఉండాలని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు గురించి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా పండాలని వ్యాపారులు అభివృద్ధి చెందాలని వరుణ దేవుని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మునిసిపల్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, శ్రీనివాస్ చారి వెంకటరెడ్డి తాండూరు మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, సర్పంచ్ పాండురంగారెడ్డి కౌన్సిలర్లు నవీన సుప్రీత నాగలక్ష్మి సురేష్ నాయక్ నాయకులు వరాల శ్రీనివాస్ రెడ్డి సంతోష్ గౌడ్ కరుణాకర్ పటేల్ మహేశ్వర్ రెడ్డి చందు మహారాజ్ చెన్నారెడ్డి అనంతరెడ్డి రమేష్ గౌడ్, భీమ్ రెడ్డి తదితరు పాల్గొన్నారు.




