Manikonda: వంద మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ!

Manikonda: హైదరాబాద్ మణికొండలోని వాసవి గోల్డ్ అండ్ డైమండ్ అధినేత రాజు జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు,

RAJESH,	WEST ZONE
Published on: 9 July 2026 5:08 PM IST
Manikonda
X

Manikonda: వంద మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ!

మణికొండ: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించడం విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత అన్నారు హైదరాబాద్ మణికొండ వాసవి గోల్డ్ అండ్ డైమండ్ అధినేత రాజు తన జన్మదినం సందర్భంగా వందమంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు ,విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.

పేద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వైశ్య బిజినెస్ నెట్వర్క్ ద్వారా దాతల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు. తన పుట్టినరోజు పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజు తెలిపారు.

వాసవి గోల్డెన్ డైమండ్ షోరూమ్ లో బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు సైతం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏడు లక్షల 20వేల రూపాయల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఉచితంగా ఈవి స్కూటీలను అందించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story