Chevella: చేవెళ్ల నియోజకవర్గంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Chevella: చేవెళ్ల, శంకర్‌పల్లి పట్టణాల్లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఎమ్మెల్యే కాలే యాదయ్య నివాళులర్పించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 26 Sept 2026 1:16 PM IST
Chevella
X

Chevella: చేవెళ్ల నియోజకవర్గంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Chevella: “అన్యాయానికి ఎదురు నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ… తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీక” అని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణం, శంకర్‌పల్లి పట్టణాల్లో ఆమె విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. భూమి, హక్కుల కోసం నాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.యువత చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర, పోరాట స్ఫూర్తిని తెలుసుకోవాలని సూచించారు.ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రజక సంఘం నాయకులు, సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA