Ghatkesar: పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
Ghatkesar: మేడ్చల్ జిల్లా ఘనపూర్ పకీర్‌టెక్క తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ప్రారంభించారు.
Ghatkesar: పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
Ghatkesar: మేడ్చల్ జిల్లా ఘనపూర్ పకీర్‌టెక్క తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోకి ప్రవేశించిన కుటుంబాలతో కలిసి ఆయన ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ, తన ప్రాంతమైన ఘనపూర్ పకీర్‌టెక్క తండాను ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు.
ఇప్పటికే సుమారు 70 ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణాలు పూర్తయ్యాయని, లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




