Venkateshwara Nagar: ఘనంగా వినాయక చవితి వేడుకలు - ప్రత్యేక పూజలు

Venkateshwara Nagar: వెంకటేశ్వర నగర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. 35 బ్లాక్ బస్తీ దవాఖాన వద్ద యువతరం యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాలనీవాసులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 14 Sept 2026 11:45 PM IST
Venkateshwara Nagar
X

Venkateshwara Nagar: ఘనంగా వినాయక చవితి వేడుకలు - ప్రత్యేక పూజలు

వెంకటేశ్వర నగర్: వెంకటేశ్వర నగర్ లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంకటేశ్వర నగర్ 35 బ్లాక్ బస్తీ దవఖాన దగ్గర "యువతరం యూత్" ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద కమిటీ సభ్యులు కాలనీవాసుల తో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల కష్టాలను తొలగించి వారి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరూ సోదరభావం, ఐక్యతతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు ఎర్ర లక్ష్మయ్య, పల్లపు బాబు, రాంబాబు, బొమ్మ శ్రీధర్, యాదగిరి, భీమ్ రాజ్, భీమ్, అనిల్, లక్ష్మణ్, అఖిల్, బాబు, ప్రసాద్, చందు, రాము, ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR