Tandur: ట్రస్టు ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం: చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు!
Tandur: విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణ పోరాటంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Tandur: ట్రస్టు ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం: చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు!
తాండూర్: విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఆస్తుల అన్యాక్రాంతం పై కోర్టులో నడుస్తున్న అన్ని కేసుల్లో అంతిమంగా తామే విజయం సాధిస్తామని ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి శశి ప్రభ మాణిక్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టులో కేసు విషయమై హాజరై కోర్టుకు సంబంధించిన విలువైన సమాచారాన్ని కోర్టుకు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాలు నుండి చేస్తున్న పోరాటం ప్రస్తుతం అంతిమ దశకు చేరుకుందని తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ట్రస్టు ఆస్తులను అన్యాకాంతం కాకుండా రక్షించి తాండూర్ ప్రజలకు ఉచిత విద్య వైద్య ఆరోగ్య ఉపాధి కార్యక్రమాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. ఇట్టి విషయములో న్యావాదులు ట్రస్ట్ సభ్యులు రామకృష్ణ, రఘు ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు.




