Vikarabad: వికారాబాద్ జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ (DPRC) సమావేశం

Vikarabad: వికారాబాద్‌లో అదనపు ఎస్పీ రాజేష్ మీనా అధ్యక్షతన జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ (DPRC) సమావేశం. గ్రేవ్ అక్విటల్ కేసుల విశ్లేషణ, అధికారులకు ఆదేశాలు.

MOGULAIAH, VIKARABAD
Published on: 17 Oct 2026 11:42 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ (DPRC) సమావేశం

వికారాబాద్: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, ఐపీఎస్ అధ్యక్షతన సెప్టెంబర్ నెలకు సంబంధించిన జిల్లా ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ (District Prosecution Review Committee - DPRC) సమావేశం ఈరోజు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో సెప్టెంబర్ నెలలో నమోదైన గ్రేవ్ అక్విటల్ కేసులపై ప్రధానంగా సమీక్ష నిర్వహించారు. కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కావడానికి గల కారణాలు, దర్యాప్తులో జరిగిన లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణ, సాక్షుల హాజరు తదితర అంశాలను కేసుల వారీగా క్షుణ్ణంగా పరిశీలించారు.

కేసుల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని అదనపు ఎస్పీ గారు అధికారులకు సూచించారు.

దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (CDOs), సెషన్స్ కోర్టు లైజన్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేస్తూ, కేసుల దర్యాప్తు నుంచి కోర్టు విచారణ వరకు ప్రతి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే కోర్టు కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సాక్ష్యాధారాల సేకరణ, కేసు రికార్డుల నిర్వహణ, సాక్షుల హాజరు, చార్జ్‌షీట్ల నాణ్యత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ అనిల్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెహ్రాజ్ పిర్దోష్ , డీఎస్పీలు బి. జనయ్య, ఎన్. శ్రీనివాస్, ఎస్. శ్రీనివాసులు, నర్సింగ్ యాదయ్య, అంజయ్య, సీఐలు నాగార్జున, పరమేశ్వర్ గౌడ్, వెంకట్, కొండల్ రెడ్డి, రఘు రాములు, రఘు కుమార్, వెంకట్ రామ్ నాయక్, చంద్రశేఖర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సంబంధిత ఎస్‌డీపీఓలు, సెషన్స్ కోర్టు లైజన్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు (CDOs), ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD