Vikarabad: వికారాబాద్ లో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు!
Vikarabad: వికారాబాద్ జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు, పురోహితులు, పాస్టర్లు, ఖ్వాజిలతో ప్రత్యేక అవగాహన సదస్సు.
Vikarabad: వికారాబాద్ లో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు!
Vikarabad: తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మిషన్ వాత్సల్య పథకం- మరియు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల పైన అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని పురోహితులు,ఖ్వాజిలు పాస్టర్స్ హాజరు కావడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సంక్షేమ అధికారిణి బి. కృష్ణవేణి మాట్లాడుతూ మన జిల్లాలో తెలిసీ తెలియక ఎక్కడో ఒకచోట బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని వాటిని ఆరి కట్టవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉందని అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా కు మారుమూల ప్రాంతాలు, ఎక్కువగా ఉండటం అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులుగా ఉండడంవల్ల పిల్లలకు చిన్నతనంలో పెండ్లిలు చేస్తే కలిగే ఆరోగ్య సమస్యల గురించి మరియు చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
సాధ్యమైనంత వరకూ మన జిల్లాలో బాల్య వివాహ నిర్మూలనకు కృషి చేస్తున్నామని దానికి వివిధ శాఖల సమన్వయంతో బాలవివాహాలను నిలుపుదల చేస్తున్నామని చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే అమ్మాయికి కలిగే ఆరోగ్య సమస్యల గురించి ప్రతి గ్రామంలో ఏర్పాటుచేసిన విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ లో అవగాహన కల్పిస్తున్నామని అదేవిధంగా శాఖ తరపున కళాజాత బృందం వివిధ గ్రామాల్లో తిరిగి బాల్య వివాహాల పైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు .
ముందుగా ఒక పెండ్లి చేయాలంటే పెళ్లి ముహూర్తం విషయమై ముందుగా అమ్మాయి తల్లిదండ్రులు పురోహితులను, ఖ్వాజిలను, పాస్టర్లను ఆశ్రయిస్తారు కాబట్టి మీరు అక్కడే అమ్మాయి యొక్క ఏజ్ సర్టిఫికేట్- బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి మెమోను ప్రామాణికంగా తీసుకొని సరియైన వయసు లేనట్లయితే అక్కడే మీరు బాల్య వివాహాన్ని నిలుపుదల చేసి.సంబంధిత శాఖ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ వెంకటేష్ మాట్లాడుతూ,
మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లా మనదే కావడం చాలా బాధాకరమని ఇట్టి బాల్యవివాహాల నిర్మూలనకై గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను బలోపేతం చేయాలని నెలకు లేదా అతి మూడు నెలలకు ఒకసారి అయినా మీటింగ్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని , బాల్య వివాహాల నిర్మూలనకై ముఖ్యంగా ఆడపిల్లల చదువుతున్న స్కూల్లో వారి యొక్క హాజరు శాతాన్ని పరిశీలించి డ్రాప్స్ అవుట్స్ అధికంగా ఉంటే వారి ఇంటికి వెళ్లి డ్రాప్ అవుట్ కావడానికి గల కారణాలను పరిశీలించి తిరిగి వారు తరగతి గదిలో చేరే విధంగా చూసినట్లయితే బాల్య వివాహాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మనం బాల్య వివాహాన్ని
నిర్ధారించడానికి ఆధార్ కార్డు ప్రామాణికం కాదని, బర్త్ సర్టిఫికెట్ కానీ, ఎస్ఎస్సి మెమోను ప్రామాణికంగా తీసుకోవాలని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించుకుని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మన జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
కొంతమంది తల్లిదండ్రులు బాల్య వివాహాల పైన అవగాహన లేకుండా మా అమ్మాయికి పెళ్లి చేస్తుంటే అధికారులు వచ్చి తీసుకెళ్లారని దానికి మీ సహకారం కావాలని మా దగ్గరికి వస్తుంటారని అలాంటి వారికి మేము ఎప్పుడు సహాయ సహకారాలు అందివ్వనని మీ అమ్మాయికి చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడంఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో వాళ్లకి వివరించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి మహోత్తరమైన కార్యక్రమానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ కాంతారావు మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు బాల్య వివాహం చేస్తే వారికి శారీరక సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాల పైన అవగాహన లేకుండా వల్ల అతి చిన్న వయసులో గర్భం దాల్చడం వలన తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరం అని తెలిపారు తీవ్ర పౌష్టికాహారం లోపం వల్ల రక్తహీనతతో మాత శిశువు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు.
ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు సమాచారం అందించాలని వారి వివరాలు గొప్యంగా ఉంచి బాల్య వివాహ నిర్ములన కు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి జానయ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సంగమేశ్వర్, స్థానిక సి డి పి వో లు వెంకటేశ్వరమ్మ , మెహరున్నీసా, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ ,మిషన్ వాత్సల్య సిబ్బంది ,మహిళా సాధికారత కింది సిబ్బంది, సూపర్వైజర్లు జిల్లాలోని పురోహితులు, ఖ్వాజిలు పాస్టర్స్ మొదలగు వారు హాజరు కావడం జరిగింది.




