Vikarabad: మెతుకు ఆనంద్‌ను బెదిరిస్తే ఊరుకోం - బీఆర్ఎస్ స్పష్టత
Vikarabad: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
Vikarabad: మెతుకు ఆనంద్‌ను బెదిరిస్తే ఊరుకోం - బీఆర్ఎస్ స్పష్టత
వికారాబాద్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు దిగడం కాంగ్రెస్ పార్టీ నాయకుల అసహనానికి నిదర్శనమని బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నర్సింలు అన్నారు.
స్పీకర్‌పై ఆరోపణలు చేశారని అంటున్నారు.. మరి ఆనంద్ లేవనెత్తిన ప్రజా సమస్యలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చూస్తే అది సాధ్యం కాదన్నారు.
అమలు కాని హామీలు, వికారాబాద్‌లో నిలిచిపోయిన అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలు, పేదల ఇళ్ల సమస్యలు ఇలా ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నిస్తే “నోరు అదుపులో పెట్టుకో” అంటూ బెదిరించడం కాదు.. వాస్తవాలతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితబంధు గురించి ప్రశ్నించే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు సమాధానం బెదిరింపులు కాదు.. పనితీరు, వాస్తవాలు కావాలి.
“ఇల్లు ముట్టడిస్తాం” అంటూ బెదిరింపులు చేయడం కాంగ్రెస్ నాయకుల రాజకీయ దివాళాకోరుతనాన్ని చూపిస్తోందని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడే ప్రసక్తే లేదని నర్సింలు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఆనంద్ ప్రశ్నిస్తూనే ఉంటారు.. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ నిలబడుతూనే ఉంటుంది.




