Vikarabad: ఆత్మహత్య కాదు.. భర్తే చంపేశాడంటూ బంధువుల ఆందోళన!

Vikarabad: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది.

WAZID, PARIGI
Published on: 14 Jun 2026 4:09 PM IST
Vikarabad
X

Vikarabad: ఆత్మహత్య కాదు.. భర్తే చంపేశాడంటూ బంధువుల ఆందోళన!

Vikarabad: వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామంలో చోటు చేసుకున్న మహిళ ,ఇద్దరు పిల్లల మరణం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మొదట దీనిని ఆత్మహత్యగా భావించినా, ఇప్పుడు కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇది ఆత్మహత్య కాదని, కచ్చితంగా తన భర్తే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మృతురాలి చెల్లెలు జ్యోతి సంచలన విషయాలను బయటపెట్టింది. ఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ తన అక్క రాసింది కాదని, అది తన బావనే రాసి, మరణాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. తమ అక్కను బావే హత్య చేశాడని, అతడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు, పరిగి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యుడైన భర్తను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూనన్నారు.

కుటుంబ సభ్యుల ఆరోపణలతో ఈ కేసు ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. సూసైడ్ నోట్‌పై , పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమంటుంది? నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story