Vikarabad: నేటి నుంచి మండలాల్లోనూ ‘ప్రజావాణి’ కలెక్టర్ దీపక్ తివారి

Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్‌లో 113 అర్జీలతో ప్రజావాణి. నేటి నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహణ ఉంటుందని కలెక్టర్ దీపక్ తివారి ప్రకటన.

MOGULAIAH, VIKARABAD
Published on: 17 Aug 2026 6:44 PM IST
Vikarabad
X

Vikarabad: నేటి నుంచి మండలాల్లోనూ ‘ప్రజావాణి’ కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్: ప్రజావాణిలో ప్రజల సమస్యలపై ప్రజా ఫిర్యాదు లు స్వీకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశం హాలు లో నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు మరియు సమస్యలకు సంబంధించిన 113 దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, సంబంధిత శాఖలకు సంబంధించి దరకాస్తు లను స్వీకరించారు.

ప్రజల నుండి అందిన వినతులను స్వీకరించి, వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తూ నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రజల సమస్యలను పెండింగ్ ఉంచకుండా పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించాలని ,ప్రతి వినతిని పరిశీలించి అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని, శాఖల వారిగా పెండింగ్ ఉన్న వాటిని త్వరితిగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

ఈరోజు నుండి ప్రతి మండలం లో ఏం పి డి ఓ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని, మండలాల లో ఉండే ప్రజలు ప్రతి సోమవారం మండలాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని’ మండల ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

మొక్కలు నాటే కార్యక్రమం లో బాగంగా జిల్లాకు ఉన్న లక్ష్యం మేరకు సంబంధిత అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనింగ్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్,జడ్ పి సి ఇ ఓ సుధీర్, డి ఆర్ ఓ స్వర్ణ లత, డి ఆర్ డి ఓ శ్రీనివాస్,జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story