Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్ ఆకస్మిక తనిఖీ!
Vikarabad: వికారాబాద్లో ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్ దీపక్ తివారి. భద్రత, సీసీ కెమెరాల పనితీరు పరిశీలన.
Vikarabad: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్ ఆకస్మిక తనిఖీ!
Vikarabad: వికారాబాద్ జిల్లా లో ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణ లో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, పరిశీలించారు.
ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను కుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ వెంకటాచారి,ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హాలీ, తహసిల్దార్ లక్ష్మీనారాయణ,సిబ్బంది తదితరులు ఉన్నారు.




