Vikarabad: వికారాబాద్ కలెక్టర్ సీరియస్: ‘ప్రజావాణి’ సమస్యలపై 30 రోజుల్లో తేల్చాల్సిందే!
Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజావాణిలో 150 దరఖాస్తులను స్వీకరించారు. సమస్యలను 30 రోజుల్లోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.
Vikarabad: వికారాబాద్ కలెక్టర్ సీరియస్: ‘ప్రజావాణి’ సమస్యలపై 30 రోజుల్లో తేల్చాల్సిందే!
వికారాబాద్: ప్రజావాణి కార్యక్రమంలోవచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ హాలు లో జడ్ పి సి ఇ ఓ సుదీర్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఇందిరమ్మ ఇండ్లు, భూమి సర్వే , ఆసరా పెన్షన్లు , జిల్లా పంచాయతి , పంచాయతి రాజ్ సంబంధిత శాఖ లకు సంబంధించి దరకాస్తు లు మొత్తం 150 దరకాస్తు లు వచ్చాయని, జిల్లా అధికారులు వచ్చిన దరకస్తులను క్షేత్ర స్తాయీ లో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ పరిదిలో నిర్వహిస్తున్నామని, డివిజన్ పరిదిలో వచ్చే దరఖాస్తు లను సంబంధిత డివిజన్ అధికారులే పరిష్కారం చేయాలనీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో 30 రోజుల్లో పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని , లేనిచో క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుందని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశం లో డి ఆర్ డి ఎ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.




