Vikarabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ దీపక్!
Vikarabad: వికారాబాద్ ప్రజావాణిలో 118 దరఖాస్తులు అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశం, మీ ప్రమాణం యాప్ ద్వారా హాజరు నమోదు తప్పనిసరి.
Vikarabad: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ దీపక్!
వికారాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో ఈ రోజు అందిన 118 దరఖాస్తులతో పాటు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని సూచించారు.
పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా అధికారులు మరియు సిబ్బంది మీ ప్రమాణం మొబైల్ యాప్ ద్వారా తమ హాజరును (అటెండెన్స్) తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ సేవల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డిఆర్ఓ స్వర్ణలత, జెడ్పి సీఈవో సుధీర్, మరియు జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




