Vikarabad: వికారాబాద్‌లో ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిధిలోని ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు.

MOGULAIAH, VIKARABAD
Updated on: 29 May 2026 7:09 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో ఈవీఎంల గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

Vikarabad: వికారాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయము పరిధిలో ఉన్న బ్యాలట్ యూనిట్లు, పోస్టల్ బ్యాలెట్లు భద్రపరచిన గోదామును జిల్లా కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారము పరిశీలించారు. గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలు, బ్యాలట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు మరియు పోస్టల్ బ్యాలెట్ల భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, భద్రతా సిబ్బంది విధులు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదాంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు నిరంతరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగ అధికారులు, నేమత్ హాలి పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story