Vikarabad: ఈ నెల 25న వికారాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్ర!

Vikarabad: ఈ నెల 25న వికారాబాద్‌లో సాంప్రదాయబద్ధంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర. డీజేలు లేకుండా సాంప్రదాయ నృత్యాలతో జరపాలని ఉత్సవ కమిటీ, పోలీసుల విజ్ఞప్తి.

MOGULAIAH, VIKARABAD
Published on: 21 Sept 2026 8:53 AM IST
Vikarabad
X

Vikarabad: ఈ నెల 25న వికారాబాద్‌లో వినాయక నిమజ్జన శోభాయాత్ర!

Vikarabad: ఈ నెల 25న వికారాబాద్ పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వికారాబాద్ పట్టణ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు.

పట్టణంలోని రామమందిరంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాధవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ మాట్లాడారు.

వినాయక చవితి ఉత్సవాలకు వికారాబాద్ పట్టణంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, అయితే గత కొన్ని సంవత్సరాలుగా నిమజ్జన శోభాయాత్రను ఆశించిన స్థాయిలో నిర్వహించడం సాధ్యం కాలేదని వారు తెలిపారు. ఈసారి డీజే సంప్రదాయాలకు దూరంగా ఉండి, హిందూ సాంప్రదాయ నృత్యాలు, భక్తి కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా శోభాయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు.

పట్టణంలోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు, యువత సహకరించి విఘ్నేశ్వరుడి శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి మండపం నుంచి వినాయక విగ్రహాలు సాయంత్రం 5 గంటలలోపు ఆలంపల్లి ప్రధాన రోడ్డు మీదుగా న్యూ గంజ్‌లోకి చేరేలా నిర్వాహకులు సహకరించాలని సూచించారు.

పోలీసులకు సహకరించాలి

అనంతరం వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, పట్టణ సీఐ రఘుకుమార్ మాట్లాడుతూ.. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, యువత పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శోభాయాత్ర ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, మాజీ మున్సిపల్.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD