Vikarabad: వికారాబాద్‌లో అక్రమ కట్టడాలపై సిపిఎం నిరసన

Vikarabad: వికారాబాద్‌లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం, ప్రజా సంఘాల నిరసన. 18న పెద్ద ఎత్తున ఆందోళనకు హెచ్చరిక.

MOGULAIAH, VIKARABAD
Published on: 16 July 2026 2:34 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో అక్రమ కట్టడాలపై సిపిఎం నిరసన

వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గల అనంతగిరిపల్లి, రామయ్య గూడా, గృహకల్ప పరిధిలోని ప్రభుత్వ స్థలములో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నవారికి పొజిషన్ చూపించాలనీ వికారాబాద్ మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో నిరసన తెలియజేసి కమిషనర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూవికారాబాద్ మునిసిపల్ పట్టణంలో సర్వే నంబర్ 90, 190, 121, 290, 291,292, 104మరియు బిళ్ళదాకాలా లో గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన నిరుపేదలకు ఇళ్లస్థలం చూపించాలని, అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన గాలికి వదిలేస్తున్నారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ MLA ,జిల్లా కలెక్టర్ , ఈ ప్రాంతాల్లో పర్యటించి పర్మిషన్లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకు పొజిషన్ చూపించి డబల్ బెడ్ రూమ్లో, ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐ ఎం, డివైఎఫ్ఐ యువజన సంఘం, రైతు సంఘం, కెవిపిఎస్, అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేయడం జరిగింది.

జిల్లా కలెక్టర్ తహసిల్దార్ మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని లేనిచో ఈ నెల 18న పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడుతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం, డివైఎఫ్ఐ రైతు సంఘం కెవిపిఎస్ అంబేద్కర్ సంఘాల నాయకులు మహిపాల్ సుదర్శన్ సతీష్, నర్సింలు, మల్లయ్య, రమేష్, అశోక్, యాదయ్య, రమేష్, కుమార్ బాలరాజు రాజు నర్సింలు, కృష్ణ నరేష్ అనంతయ్య యాదగిరి పెద్ది రాములు రమేష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story