Vikarabad: వికారాబాద్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య!

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గొంగుపల్లి సీతమ్మ గుడి వద్ద మంగ్యా నాయక్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

WAZID, PARIGI
Published on: 7 Jun 2026 11:19 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య!

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గొంగుపల్లి సమీపంలోని సీతమ్మ గుడి వద్ద మంగ్యా నాయక్ అనే వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన మంగ్యా నాయక్ శరీరం మరియు తలపై తీవ్ర రక్తగాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

గొంగుపల్లికి చెందిన ఓ మహిళతో మృతుడికి కొన్నేళ్లుగా ఉన్న అక్రమ సంబంధమే ఈ మృతికి కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

సదరు మహిళ, ఆమె కొడుకు కలిసి మంగ్యా నాయక్‌ను దారుణంగా హత్య చేశారని మృతుడి కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కనీసం పంచనామా కూడా చేయకుండా పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story