Vikarabad: వికారాబాద్‌లో 'మై భారత్' నమోదుపై ప్రత్యేక సమీక్ష

Vikarabad: వికారాబాద్ జిల్లాలో 'మై భారత్' నమోదు కార్యక్రమంపై అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధ్యక్షతన డీఏసీ, డీఎస్సీ సమావేశాలు నిర్వహణ.

MOGULAIAH, VIKARABAD
Published on: 5 Aug 2026 3:07 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో 'మై భారత్' నమోదుపై ప్రత్యేక సమీక్ష

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో 'మై భారత్' నమోదు కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి జిల్లా సలహా కమిటీ (డీఏసీ) & జిల్లా సమన్వయ కమిటీ (డీఎస్సీ) సమావేశాలు నిర్వహణ.

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ 'మై భారత్' (మేరా యువ భారత్) ఆధ్వర్యంలో, వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ ఉమాశంకర్ ప్రసాద్, ఐఏఎస్ గారి అధ్యక్షతన జిల్లా సలహా కమిటీ (డీఏసీ) మరియు జిల్లా సమన్వయ కమిటీ (డీఎస్సీ) సమావేశాలు నిర్వహించబడ్డాయి.

ముమ్మరమైన 'మై భారత్' నమోదు & అవగాహన కార్యక్రమం పురోగతిని సమీక్షించి, జిల్లాకు నిర్దేశించిన యువత నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యం. సభ్యులకు స్వాగతం పలుకుతూ మై భారత్ వికారాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి బి. స్నేహల్ జ్ఞానేశ్వర్ బసుత్కర్ మాట్లాడుతూ, మై భారత్ కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద సేవ, నాయకత్వ వికాసం, పౌర భాగస్వామ్యం మరియు సామాజిక సేవల ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం ప్రధాన లక్ష్యమని వివరించారు.

జిల్లా లక్ష్యాన్ని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయడానికి అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీ ఉమాశంకర్ ప్రసాద్, ఐఏఎస్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి అర్హ యువకుడు, యువతి మై భారత్ పోర్టల్‌లో mybharat.gov.in నమోదు అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ & గైడ్స్, యువజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు, నమోదు శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.

చర్చల సందర్భంగా జిల్లా సలహా కమిటీ (డీఏసీ) మరియు జిల్లా సమన్వయ కమిటీ (డీఎస్సీ) సభ్యులు జిల్లాలో యువత నమోదును వేగవంతం చేయడానికి పలు సూచనలు చేశారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, పాఠశాలలు, పురపాలక సంస్థలు మరియు గ్రామ పంచాయతీలలో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ & గైడ్స్, యువజన సంఘాల ద్వారా యువతను సమీకరించాలని, గ్రామ సభలు, అవగాహన సమావేశాలు మరియు శాఖాపరమైన కార్యక్రమాల ద్వారా మై భారత్ పోర్టల్‌పై విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.

ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించి, నమోదుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ మై భారత్ జిల్లా కార్యాలయంతో సమన్వయం కొనసాగించాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాకు నిర్దేశించిన యువత నమోదు లక్ష్యాన్ని పూర్తి చేసి, యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా భాగస్వాములను చేయడానికి అన్ని శాఖల సమిష్టి కృషి అవసరమని ఆయన పేర్కొన్నారు.

సభ్యులందరూ మై భారత్ నమోదు & అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో సమావేశం ముగిసింది. వికారాబాద్ జిల్లాలోని అర్హులైన యువత అందరూ మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకుని, స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ, నాయకత్వ వికాసం మరియు దేశ నిర్మాణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని మై భారత్ విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశానికి జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బి. యాదగిరి, జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ ఆర్. మహేశ్వర్, జిల్లా యువజన సేవలు & క్రీడల అధికారి పి. నర్సింహులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి వై. మాధవరెడ్డి.

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం. జయపాల్ రెడ్డి, జిల్లా అదనపు డీఆర్‌డీఏ అధికారి ఎం. సత్తయ్య, ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి జయచంద్ర రెడ్డి, ఎన్‌సీసీ నోడల్ అధికారి శ్రీనివాసులు, జిల్లా ఉపాధి అధికారి సిద్దిక్ అన్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి మొహమ్మద్ అబ్దుల్ ఘనీ, మై భారత్ ప్రతినిధి దాసరి శ్రీశైలంతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story