Pargi: పరిగిలో వికలాంగుల వినూత్న నిరసన.. హామీల అమలుకు డిమాండ్

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట వికలాంగుల నిరసన; రూ.6 వేల పింఛన్, ఆర్టీసీ ఉచిత బస్సు హామీలు అమలు చేయాలని డిమాండ్.

WAZID, PARIGI
Published on: 21 Nov 2026 4:22 PM IST
Pargi
X

Pargi: పరిగిలో వికలాంగుల వినూత్న నిరసన.. హామీల అమలుకు డిమాండ్

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు వికలాంగులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్, జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు నెలకు 6 వేల రూపాయల పింఛన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు చేయలేదని వారు మండిపడ్డారు.అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

వికలాంగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్.. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, ముఖ్యమంత్రి దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

WAZID, PARIGI

WAZID, PARIGI