Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా ‘దిశా’ సమీక్షా సమావేశం!
Vikarabad: కేంద్ర నిధులను సకాలంలో వినియోగించి వికారాబాద్ అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘దిశా’ సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశం.
Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా ‘దిశా’ సమీక్షా సమావేశం!
వికారాబాద్: బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై తాండూర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య లతో కలిసి ఎంపీ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే పనులను పారదర్శకంగా చేపట్టాలన్నారు. అభివృద్ధిలో భాగంగా చేపట్టే పనులను సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలిపారు. రోడ్ల నిర్మాణం, పాఠశాలల్లో మౌలిక వసతులు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
విబీ జీ రామ్ జీ, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన లో చేపట్టే పనులు నాణ్యతతో చేపట్టాలని తెలిపారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలని ఎంపీ అధికారులకు సూచించారు.
మత్స్య సంపద యోజణ పథకం ద్వారా మత్సకారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టే మరమ్మత్తు పనులు నాణ్యతతో చేపట్టాలని ఆయన తెలిపారు.
గ్రామ సడక్ యోజన రోడ్ల నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని ఆయన తెలిపారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాలు నివారించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
పిఎం అవాజ్ యోజన, పిఎం జన్మాన్ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లను మంజూరు చేయాలని హౌసింగ్ అధికారికి ఎంపీ సూచించారు. జిల్లాల్లో వివిధ నిర్మాణాల దశల్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు అందజేయాలని ఆయన తెలిపారు.
జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి భూసేకరణ నివేదికలు సమర్పించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారిని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ ను తప్పనిసరిగా అమలు చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పంచాయతీ, ఆర్ అండ్ బి, స్వచ్ఛ భారత్, 15వ ఫైనాన్స్ కమిషన్, జాతీయ రహదారులు, మున్సిపాలిటీ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా ఆసుపత్రి, పిహెచ్సీ లలో వైద్య సేవలు మెరుగుపరచాలని, ఆసుపత్రిలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రజలకు అందించాలని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో మైనింగ్ ద్వారా ఆదాయం సమకూర్చుకపోగా అక్రమ మైనింగ్ జరుగుతుందని దీనిని అరికట్టాలని అధికారిని ఆదేశించారు. బ్యాంకర్ లు హోసింగ్, ఎడ్యుకేషన్ కు సంబందించిన రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశించారు.
మిషన్ భగీరథ క్రింద గ్రామాలలో నీటి సమస్యలు పై అధికారుల ద్రుష్టి కి తీసుకురావాలన్నారు. బి ఎస్ ఎన్ ఎల్,సివిల్ సప్ప్లై, కార్మిక శాఖ, స్పోర్ట్స్,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ లపై సమీక్షించారు. నూతనంగా ఏర్పాటైనా సర్పంచు లకు సన్మానం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్ లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారీ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జడ్పి సీఈఓ సుధీర్, డిఆర్డీఓ శ్రీనివాస్, డిఎఫ్ఓ విశాల్ బత్తుల, జిల్లా అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




