Vikarabad: వికారాబాద్ మెడికల్ కాలేజీని సందర్శించిన డాక్టర్ ఆనంద్!

Vikarabad: వికారాబాద్ మెడికల్ కాలేజీలో కనీస వసతులు కరవయ్యాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆగ్రహం. విద్యార్థుల సమస్యలపై అధికారుల తీరుపై మండిపాటు.

MOGULAIAH, VIKARABAD
Published on: 9 Oct 2026 2:43 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ మెడికల్ కాలేజీని సందర్శించిన డాక్టర్ ఆనంద్!

Vikarabad: వికారాబాద్ జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. అక్కడ వైద్య విద్యార్థినీ విద్యార్థులతో సంభాషించి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

వారు చెప్పిన సమస్యలు

1) కళాశాలలో తాగునీరు లేదు.

2)బాత్రూంలు సరిగా లేవు.

3)దోమల మందు కొట్టే దిక్కులేరు

4)పాములు, తేలు హాస్టళ్లకు వస్తున్నాయి 5)విద్యార్థులకు కాలేజీ నుంచి హాస్పిటల్కు తీసుకెళ్లడానికి బస్సు లేదు

6)ఆహారంలో పురుగులు, పాలలో దోమలు వస్తున్నాయి బయటి ఆహారాన్ని లోపలికి అనుమతించడం లేదు, లోపల ఉండే ఆహారం నాణ్యత సక్కగా లేదు. అమ్మ పెట్టదు అడుక్కొని తినివ్వదు అన్న చందంగా ఉంది

7)లేబరేటరీస్ లో తగిన సౌకర్యాలు లేవు

8)లైబ్రరీ అతి దారుణంగా ఉంది. చదువుకోవడానికి పుస్తకాలు, జర్నల్సు లేవు.

9)స్మార్ట్ బోర్డ్స్ లేవు

10)కరెంటు పోతే జనరేటర్లో డీజిల్ పోసే దిక్కు లేదు

11)హాస్టల్లో వాషింగ్ మిషన్స్ లేవు

12)ఫైనలియర్ విద్యార్థులకు క్లాస్ రూమ్ లేదు. 13)ఇప్పటివరకు నయా పైసా స్కాలర్షిప్ రాలేదు.

మన పిల్లలు ఇటువంటి కాలేజీలలో చదివితే, ఇలాగే వదిలేస్తామా ? స్పీకర్ గారు ఆలోచించాలి ఈ ప్రజా సమస్యలన్నీ లేవనెత్తేది మా ఇంటి సంసారం గురించి కాదని కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పదవిలో ఉండటం ముఖ్యం కాదు, పెద్ద పెద్ద పనులు, ప్రజలకు ఉపయోగం అయ్యే పనులు చేస్తే పెద్ద మనుషులవుతారు, పదవితో కాదు ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు ప్రతిపక్షాలను తిట్టించడం మానుకొని, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD