Vikarabad: యువత గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు: డాక్టర్ మెతుకు ఆనంద్!
Vikarabad: హైదరాబాద్ బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ యువ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడటాన్ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా ఖండించారు.
Vikarabad: యువత గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు: డాక్టర్ మెతుకు ఆనంద్!
వికారాబాద్: హైదరాబాద్ బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ యువ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటనను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ యువత ఉద్యోగాల గురించి, ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ దాడులకు దిగడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
ప్రశ్నించే గొంతుకలను భయపెట్టాలని చూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దాడికి బాధ్యులపై నిష్పక్షపాత విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రశ్నించే గొంతుకలను దాడులతో అణచివేయలేరు.




