Vikarabad: విద్యార్థుల నిరసనకు అనుమతి నిరాకరణ ఖండనీయం ఆనంద్
Vikarabad: వికారాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల జీవో 97 రద్దు డిమాండ్ నిరసనకు అనుమతి నిరాకరించడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర ఖండన.
Vikarabad: విద్యార్థుల నిరసనకు అనుమతి నిరాకరణ ఖండనీయం ఆనంద్
వికారాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థుల G.O. 97 రద్దు డిమాండ్‌పై చేపట్టిన నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం తీవ్రంగా ఖండనీయం.
విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడానికి నిరసన చేపడితే, స్పీకర్ పర్యటన ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం ఎందుకు? అని ప్రశ్నిస్తూ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపారు.
ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును వినాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. విద్యార్థుల డిమాండ్‌ను ప్రభుత్వం, అధికారులు సీరియస్‌గా తీసుకుని G.O. 97ను వెంటనే రద్దు చేయాలి.
స్పీకర్ పర్యటన కంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం! అనుమతులు నిరాకరించడం కాదు… విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపాలి!




