Vikarabad: అర్హులైన ప్రతి పట్టభద్రుని ఓటరుగా నమోదు చేయాలి పైలట్ రోహిత్ రెడ్డి!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టభద్రుల ఓటరు నమోదుపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమీక్ష. ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం.
Vikarabad: అర్హులైన ప్రతి పట్టభద్రుని ఓటరుగా నమోదు చేయాలి పైలట్ రోహిత్ రెడ్డి!
Vikarabad: అర్హులైన ప్రతి పట్టభద్రుని ఓటరుగా నమోదు చేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఈరోజు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
తాండూరు బిఆర్ఎస్వి నాయకులతో పాటు బిఆర్ఎస్ నాయకులు మరియు నేతాజీ గురుదేవ్ గురుకుల్, గంగోత్రి విద్యాలయ, సెయింట్ మార్క్స్ స్కూల్, సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సెయింట్ మేరీస్ స్కూల్, అక్షర కాన్సెప్ట్ స్కూల్ కు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పంజుగుల శ్రీశైల్ రెడ్డి పాల్గొని,పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు వివరించి, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.




