Vikarabad: వికారాబాద్లో 10+2 కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన
Vikarabad: వికారాబాద్లో ఫోక్సో, కుటుంబ న్యాయస్థానంతో కూడిన 10+2 కోర్టు భవన సముదాయ నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుక యార శంకుస్థాపన చేశారు.
Vikarabad: వికారాబాద్లో 10+2 కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన
వికారాబాద్: వికారాబాద్లో ఈ రోజు ఫోక్సో, కుటుంబ న్యాయస్థానంతో కూడిన 10+2 కోర్టు భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు వికారాబాద్ జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రేణుక యార , గౌరవ అతిథులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ లతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభం లతో హైకోర్టు న్యాయమూర్తులకు అట్టహాసంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హై కోర్టు న్యాయమూర్తులు అటవీ వసతి గృహంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా లు హై కోర్టు న్యాయమూర్తులకు పుష్పగుచ్ఛలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వల గావించి హై కోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ.. జిల్లాలో కోర్టుల ఏర్పాటుతో న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ కోర్టుల ప్రారంభం కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. కోర్టుల్లో రోజురోజు కు కేసులు పెరుగుతున్నాయాని, కేసుల తగ్గుదలకు అందరు కృషి చేయాల్సి అవసరం ఉందని తెలిపారు.
కోర్టుల్లో భూ సమస్యలు తగ్గించాలంటే మీడియేషన్ చట్టం పై అవగాహన కల్పించి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు. జిల్లాలో ఫోక్సో న్యాయస్థానం ఏర్పాటుతో బాలలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణ మరింత వేగవంతం కావడం జరుగుతుందని అన్నారు.
కుటుంబ న్యాయస్థానం ఏర్పాటు వల్ల కుటుంబ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మెరుగైన న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ న్యాయమూర్తి, లాల్సింగ్ శ్రీనివాస నాయక్, హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు అనంతసేనా రెడ్డి, ఆకుల మహేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు
జి.లవ కుమార్, కార్యదర్శి పి.వెంకట్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మాధవ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ యాదవ రెడ్డి, ఆర్డీఓ వాసుచద్ర, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, వివిధ కోర్టుల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




