Vikarabad: వికారాబాద్ జిల్లాలో వానల కోసం వినూత్న ప్రార్థనలు

Vikarabad: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం కోల్కొంద గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ సర్పంచ్, గ్రామస్తులు శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 16 July 2026 10:30 AM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ జిల్లాలో వానల కోసం వినూత్న ప్రార్థనలు

వికారాబాద్: వర్షాకాలం ఆరంభమై దాదాపు నెలరోజులు దాటినప్పటికీ ఇప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రైతాంగం అల్లాడుతుండగా పరిస్థితిని గమనించిన తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి , మోమిన్ పెట్ మండలం, కోల్కొంద గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ నేతృత్వంలో గురువారం ఉదయం గ్రామస్తులు గ్రామంలోని హనుమాన్ మందిరంలో గల శివ లింగానికి నందికి జలాభిషేకం నిర్వహించారు.

గ్రామస్తులు కలిసి ఆమె హనుమాన్ ఆలయానికి బిందెలతో చేరుకొని శివలింగానికి నందికి అభిషేకం నిర్వహించారు. వర్షాలు కురియని కారణంగా రైతాంగం అల్లాడుతుందని ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల జీవన విధానం అస్తవ్యస్తమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

భగవంతుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిసేలా చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు, ఉపసర్పంచ్ మహేందర్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story