Vikarabad: కంచి పుణ్యక్షేత్రంలో వికారాబాద్ వ్యక్తి మిస్సింగ్!

Vikarabad: వికారాబాద్ జిల్లా గుడిపల్లి గ్రామానికి చెందిన గోరింక శంకరయ్య కంచి పుణ్యక్షేత్రంలో అదృశ్యమయ్యారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 12 May 2026 7:22 AM IST
Vikarabad
X

Vikarabad: కంచి పుణ్యక్షేత్రంలో వికారాబాద్ వ్యక్తి మిస్సింగ్!

వికారాబాద్ జిల్లా: తీర్థయాత్రకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం.

- కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం శూన్యం

- ఆచూకీ తెలిస్తే 8106705104 నంబర్ కు తెలియజేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు.

వివరాల్లోకి వెళితే వికారాబాద్ మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన గోరింక శంకరయ్య(50) తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 4వ తేదీ వికారాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి జోగులాంబ, కోదండ రామయ్య ఆలయం, తిరుపతి, మహానంది, అరుణాచలం కంచి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది.

9వ తేదీ శుక్రవారం కంచి ఆలయంలో దర్శనం అనంతరం కనిపించకుండా పోయాడు.

కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ తెలియ రాలేదు.

అయితే ఇందుకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందనట్లు తెలుస్తుంది.

పై ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే 8106705104 నంబరు కు సమాచారం ఇవ్వాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story