Vikarabad: వికారాబాద్‌లో రెండో రోజు మున్సిపల్ కార్మికుల ధర్నా!
Vikarabad: వికారాబాద్‌లో మున్సిపల్ కార్మికుల ప్రొటెస్ట్. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, సీఎం రేవంత్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు ఎంఆర్‌పీ చౌరస్తాలో నిరసన.
Vikarabad: వికారాబాద్‌లో రెండో రోజు మున్సిపల్ కార్మికుల ధర్నా!
Vikarabad: 2వ రోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో MRP చౌరస్తాలో నిరసన చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించి తెచ్చుకున్న కార్మిక చట్టాలను, కేంద్ర బిజెపి ప్రభుత్వం నీరుగారిస్తునాది. అదే పనిలో రాష్ట్ర ప్రభుత్వo అమలుచేయడం వ్యతిరేకించాలి. వెంటనే రద్దు చేయాలి. 8గంటల పని విధానం కొనసాగించాలనీ డిమాండ్ చేస్తున్నాము. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలీ.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26వేలు అమలు చెయ్యాలి, ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 20 లక్షలు ఇవ్వాలి. పెన్షన్ సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనీ ప్రభుత్వము ఇచిన హామీలు అమలు చేసేవరకు నేటి నుండి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
వికారాబాద్ లో 34 వార్డులు, 10జోన్లు, ఉన్నవి. కార్మికుల సంఖ్య 264నుండి 400మంది వరకు పెంచాలిఅన్నారు. ఈ నిరసన ధర్నా2వ రోజు MRP చౌరస్తాలో చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ CITU వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, నాయకులు బుచ్చయ్య జ్యోతి జాఫర్ రవి, ఇలియాస్ మంగమ్మ, లచ్చమ్మ, నర్సింలు శివ కుమారు, ఆశ, రాఘవేంద్ర, సామిల్, కమల, బుచ్చయ్య జంగమ్మ, బాబు, లక్ష్మీ, రాజు తదితరులు పాల్గొన్నారు.




