Pargi: పక్షవాతం బాధితుడికి అండగా కౌన్సిలర్ మిడిగడ్డ శ్రీనివాస్!

Pargi: పరిగిలో పక్షవాతంతో బాధపడుతున్న నిరుపేదకు 15వ వార్డు కౌన్సిలర్ మిడిగడ్డ శ్రీనివాస్ ప్రతి నెలా రూ.2 వేల సొంత సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

WAZID, PARIGI
Published on: 28 Oct 2026 11:19 PM IST
Pargi
X

Pargi: పక్షవాతం బాధితుడికి అండగా కౌన్సిలర్ మిడిగడ్డ శ్రీనివాస్!

PARGI: రాజకీయాల్లో పదవులు చేపట్టేవారు ఎంతోమంది ఉంటారు.. కానీ కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేవారు కొందరే! అలాంటి మానవత్వాన్ని చాటుకుంటున్నారు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన 15వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మిడిగడ్డ శ్రీనివాస్.పరిగి పట్టణంలోని 15వ వార్డుకు చెందిన ఆంజనేయులు గత ఎనిమిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు.ఈ అనారోగ్యం కారణంగా ఆయన మాట కూడా పడిపోయింది. కుటుంబ పోషణతో పాటు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు ప్రభుత్వ పింఛన్ అందడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న 15వ వార్డు కౌన్సిలర్ మిడిగడ్డ శ్రీనివాస్.. ఆంజనేయులుకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. కౌన్సిలర్‌గా గెలిచిన తర్వాత నుంచి తన సొంత డబ్బుల నుంచి ప్రతి నెలా రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.ప్రతి నెలా స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి రూ.2,000 అందజేస్తూ.. కష్టకాలంలో తాను అండగా ఉంటాననే భరోసా కల్పిస్తున్నారు.ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్ అందడం లేదని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో.. సంబంధిత అధికారులు స్పందించి అర్హతను పరిశీలించి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI