Vikarabad: హైదరాబాద్‌ మార్గంలో సకాలంలో బస్సులు నడపాలని ప్రయాణికుడి వేడుకోలు

Vikarabad: వికారాబాద్ నుండి హైదరాబాద్‌కు సరైన సమయంలో బస్సులు నడపడం లేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 30 Sept 2026 11:27 PM IST
Vikarabad
X

Vikarabad: హైదరాబాద్‌ మార్గంలో సకాలంలో బస్సులు నడపాలని ప్రయాణికుడి వేడుకోలు

వికారాబాద్: వికారాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే ప్రయాణికులకు అనుకూలంగా సకాలంలో సరిపడా బస్సులు నడపడం లేదని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో ప్రయాణిస్తానని, అయితే ప్రతిరోజూ నిర్ణీత సమయానికి బస్సులు రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

ఉన్న బస్సులు కూడా ప్రయాణికుల అవసరాలకు సరిపడే సంఖ్యలో నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు రాకపోతే ఆర్టీసీ సిబ్బందిని అడిగితే “తాండూరు డిపో నుంచి బస్సు వస్తుంది” అని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. వికారాబాద్‌లోనే ఆర్టీసీ బస్ డిపో ఉన్నప్పటికీ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులను కలిసి సకాలంలో, ప్రయాణికులకు సరిపోయే సంఖ్యలో బస్సులు నడపాలని కోరారు. తనకు బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతూ అధికారులను వేడుకున్నారు.

ప్రతిరోజూ వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించే సమయంలో చేవెళ్ల వద్ద కూడా విద్యార్థులు, నిత్యం ప్రయాణించే ప్రయాణికులు బస్సుల్లో చోటు, సమయపాలన వంటి సమస్యలపై డ్రైవర్లు, కండక్టర్లతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.

విద్యార్థులు, ఉద్యోగులు, నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వికారాబాద్–హైదరాబాద్ మార్గంలో సకాలంలో సరిపడా బస్సులు నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ప్రయాణికుడు కోరారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD