Vikarabad: వికారాబాద్లో పట్టా భూమి కబ్జా యత్నం.. అడ్డుకుంటే బెదిరింపులు!
Vikarabad: వికారాబాద్ ఆలంపల్లి రెవెన్యూ పరిధిలో తన పట్టా భూమిని కబ్జా చేస్తూ కోర్టు నోటీసు బోర్డును తగులబెట్టారని, తనకు ప్రాణహాని ఉందని అజ్మత్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.
Vikarabad: వికారాబాద్లో పట్టా భూమి కబ్జా యత్నం.. అడ్డుకుంటే బెదిరింపులు!
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఆలంపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 277లో తనకు చెందిన పట్టా భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అజ్మత్ పాషా ఆరోపించారు. తన భూమి నుంచి రోడ్డు నిర్మాణం చేపడుతూ భూమిని కబ్జా చేస్తున్నారని, దీనిని అడ్డుకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి వేళల్లో సైతం జేసీబీలతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ విషయమై సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వాపోయారు. దీంతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా, తనకు అనుకూలంగా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని, పట్టా భూమిలో కోర్టు నోటీసు బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఆ బోర్డుకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించి ధ్వంసం చేశారని ఆరోపించారు.
తన కుమారుడు రైమత్ పాషా ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు దాడి చేస్తున్న సమయంలో తన ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ ఉన్న ప్రజలను కాపాడినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సన్మానించి అక్కడి వారసత్వం హక్కును కూడా ఇచ్చినట్టు తెలిపారు. అలాంటి వ్యక్తికి మన భారతదేశంలో అందులో తెలంగాణ రాష్ట్రంలో మరియు వికారాబాద్ జిల్లాలో సీఎం జిల్లా అయినా కూడా తన కుటుంబానికి తన భూమికి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




