Vikarabad: సారు.. మా కరెంటు కష్టాలు ఎప్పుడు తీరుస్తావ్?
Vikarabad: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జయరాం తండాలో గత 15 రోజులుగా కరెంట్ కష్టాలు తాండవిస్తున్నాయి.
Vikarabad: సారు.. మా కరెంటు కష్టాలు ఎప్పుడు తీరుస్తావ్?
Vikarabad: సారు మా ఊళ్లో కరెంట్ కష్టాలు గత 15 రోజుల నుండి ఉన్నాయి. కరెంటు కష్టాల గురించి ఎవ్వరికి ఫోన్ చేసినా ఫోన్ లావడుత లేరు. ఎవరికి చెప్పుకోవాలి మా గోస. ఇది వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం జయరాం తండా వాసుల బాధ. ప్రతిరోజు సరిగా కరెంటు సప్లై లేక తాండవవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
తాండ వాసులు హెల్పర్ సురేష్ కి ఫోన్ చేస్తే సరి అయిన సమాధానం ఇవ్వడం లేదని, ఏ ఈ కి తమ బాధని చెప్పుకుందామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మరి తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక తీవ్ర నరకయాతన పడుతున్నామని, చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దోమల బెడదతో నరకం చూస్తున్నామని తండావాసులు తమ ఆక్రోశాన్ని, బాధని వెళ్లకకుతున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తమ తాండ వాసులకి కరెంటు కష్టాలు తొలగించాలని కోరుతున్నామన్నారు. రాజకీయ నాయకులు కొంచెం తమ తండా వైపు కూడా చూసి తామున్నామని, తాము కూడా నియోజకవర్గంలో భాగమేనని, తాము కూడా ఓట్లు వేశామనే విషయాన్ని వారు మర్చిపోకుండా గుర్తించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తండా పక్షాన కోరుతున్నామన్నారు.
వెంటనే స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ తీసుకొని తాండా కష్టాలను తొలగించే విధంగా కరెంటు అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.




