Vikarabad: వికారాబాద్ జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్
Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించారు.
Vikarabad: వికారాబాద్ జిల్లాలో రౌడీషీటర్లకు పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దేముల్, మర్పల్లి, నవాబ్‌పేట్, బంట్వారం, దౌల్తాబాద్, కుల్చర్ల, కోటేపల్లి మరియు తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లను ఆయా పోలీస్ స్టేషన్లకు పిలిపించి, వారి ప్రవర్తన, గత కార్యకలాపాలను సమీక్షించారు.
భవిష్యత్తులో మంచి ప్రవర్తనతో మెలగాలని పోలీస్ అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లు అక్రమ, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
సమాజంలోబాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని స్పష్టంగా సూచించారు. కౌన్సెలింగ్ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతమైన జీవితం గడపాలని వారికి అవగాహన కల్పించారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో భాగంగా రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.




