vikarabad: పరిగి ‘కార్డన్ అండ్ సెర్చ్‌’లో 49 వాహనాలు, అక్రమ మద్యం సీజ్

vikarabad:

WAZID, PARIGI
Published on: 18 Jun 2026 2:33 PM IST
vikarabad
X

vikarabad: పరిగి ‘కార్డన్ అండ్ సెర్చ్‌’లో 49 వాహనాలు, అక్రమ మద్యం సీజ్

వికారాబాద్ జిల్లా: పరిగి మున్సిపల్ పరిధిలోని మల్లేమోనిగూడ వార్డు లో పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.

తెల్లవారుజామున 05:00 గంటల నుండి పరిగిలోని మల్లేమోనిగూడ వార్డులో ‘కమ్యూనిటీ కాంటాక్ట్’ (కార్డన్ అండ్ సెర్చ్) ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 160 మంది అన్ని రకాల ర్యాంకుల పోలీస్ అధికారుల బలగంతో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగాయి. గ్రామంలోని ప్రతి ఇల్లాన్ని, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా సోదా చేశారు.

ఈ విస్తృత తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 39 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసమే ఈ కార్డెన్ సర్చ్ ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలు కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story