Vikarabad: వికారాబాద్‌లో ఆర్‌ఆర్‌ఆర్ భూ బాధితుల నూతన జేఏసీ ఏర్పాటు

Vikarabad: వికారాబాద్‌లో ఆర్‌ఆర్‌ఆర్ భూ బాధితుల సమావేశం, నూతన జిల్లా జేఏసీ ఏర్పాటు; అలైన్‌మెంట్ మార్పులపై ఆగ్రహం, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములివ్వమని స్పష్టం.

MOGULAIAH, VIKARABAD
Published on: 21 Nov 2026 3:34 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో ఆర్‌ఆర్‌ఆర్ భూ బాధితుల నూతన జేఏసీ ఏర్పాటు

వికారాబాద్: RRR భూ బాధితుల పోరాటం మరింత ఉధృతం కానుంది.. తమ భూములు కాపాడుకునేందుకు బాధితులంతా ఏకతాటిపైకి వచ్చారు.. వికారాబాద్‌లో సమావేశమై నూతన జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.. తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. అలైన్‌మెంట్ మార్పు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పించారు.. అసలు RRR భూ బాధితుల ఆవేదన ఏంటి..?

RRR భూ బాధితుల సమావేశం వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు.. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో భూ బాధితులు పాల్గొని తమ సమస్యలు, భూముల సేకరణ, అలైన్‌మెంట్ మార్పులు, భవిష్యత్తు పోరాట కార్యాచరణపై చర్చించారు.. బాధితులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి జిల్లా స్థాయిలో నూతన జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు..

గౌరవ అధ్యక్షులుగా న్యాయవాది శుభప్రద్ పటేల్ ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జనార్ధన్ ఎన్నికయ్యారు.. ఉపాధ్యక్షులుగా పద్మారావు, గోవర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, రమ్దాస్ బాధ్యతలు చేపట్టారు. జాయింట్ సెక్రటరీలుగా డి. రవి, నరసింహారెడ్డి, తాజుద్దీన్, సుషీలా ఎంపిక కాగా.. ప్రధాన సలహాదారులుగా ప్రకాశ్ రావు, చాన్ పాషా, సత్యనారాయణ నియమితులయ్యారు.

భూములే జీవనాధారం..

తమకు ఉన్న కొద్దిపాటి భూములను కూడా RRR ప్రాజెక్టు కోసం తీసుకుంటే తమ కుటుంబాల జీవనాధారం ఏమవుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.. తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చేది లేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు..

అలైన్‌మెంట్ మార్పుపై ప్రశ్నలు..

RRR పాత అలైన్‌మెంట్‌ను మార్చడం వెనుక అసలు కారణం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేదా వారి బంధువుల భూములు ఉన్న ప్రాంతాల్లో అలైన్‌మెంట్ మార్పులు జరిగాయని ఆరోపిస్తున్నారు.. రాజకీయ నాయకుల భూములకు ఇబ్బంది కలగకుండా అలైన్‌మెంట్ మార్చి, పేద రైతుల భూములను తీసుకుంటున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పలుకుబడి ఉన్నవారి భూములు కాపాడుతూ.. పేద రైతుల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.. అలైన్‌మెంట్ మార్పు వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, తమ భూములను సేకరించాల్సిన అవసరం ఏమిటో స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.

తమ భూములు కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. బాధితులందరినీ సమన్వయం చేస్తూ నూతన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.

RRR భూ బాధితుల ఆవేదన ఒకవైపు.. అలైన్‌మెంట్ మార్పుపై రాజకీయ ఆరోపణలు మరోవైపు.. తమ భూములు, జీవనాధారం కాపాడుకునేందుకు బాధితులు పోరాట బాట పట్టారు.. ప్రభుత్వం తమ సమస్యలను పరిగణలోకి తీసుకొని, అలైన్‌మెంట్ మార్పులపై పూర్తి వివరాలు వెల్లడించి, న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD