Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

Vikarabad: వికారాబాద్ పట్టణంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. పాల్గొన్న గౌడ సంఘం నాయకులు.

MOGULAIAH, VIKARABAD
Published on: 18 Aug 2026 8:44 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్‌లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

​వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని బిజేఆర్ చౌరస్తాలో బహుజన వీరుడు, విప్లవ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు, స్థానిక కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ, పాపన్న గౌడ్ అందరి హక్కుల పోరాటానికి మరియు బహుజనాభ్యుదయానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.

ఆయన చూపిన ధైర్యం, సమానత్వ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ వేడుకల్లో గౌడ సంఘం నాయకులు, బీసీ సంఘాల నేతలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story