Vikarabad: పాలిటెక్నిక్ సమస్యలపై వికారాబాద్‌లో ఎస్ఎఫ్ఐ ధర్నా

Vikarabad: వికారాబాద్ కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్.

MOGULAIAH, VIKARABAD
Published on: 17 Aug 2026 6:53 PM IST
Vikarabad
X

Vikarabad: పాలిటెక్నిక్ సమస్యలపై వికారాబాద్‌లో ఎస్ఎఫ్ఐ ధర్నా

వికారాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ITI–ATCలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని అన్నారు.

పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత పెంచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదని వారు అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా Employment and Training పేరుతో సాంకేతిక విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి SBTET వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (NEP-2020) ద్వారా విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని SFI నాయకులు స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నత విద్య, ఇంజనీరింగ్ విద్య మరియు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జీవో నం. 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను మరింత బలోపేతం చేయాలని, కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, అధ్యాపకుల ఖాళీల భర్తీ మరియు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కోరారు.

పాలిటెక్నిక్ కోర్సులను ఇంజనీరింగ్ విద్యకు అనుసంధానిస్తూ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం, స్కిల్ యూనివర్సిటీ పేరుతో డిప్లమా విద్యను డీగ్రేడ్ చేసే విధానాలను తీసుకురావడం తీవ్రంగా ఖండిస్తున్నామని SFI వికారాబాద్ జిల్లా కమిటీ పేర్కొంది.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా, పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు విద్యా నిపుణులతో సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, పాలిటెక్నిక్ విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి భవిష్యత్తులో మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని SFI వికారాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో SFI వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, జిల్లా కమిటీ సభ్యులు అనిల్, పాండు, సాత్విక్, సాయి, పునీత్ గౌడ్ ,వర్ష భవన్ శ్రీ తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story